Saturday, January 07, 2012

అమ్మాయి సమాధానం




అబ్బాయి తన మదిలోని ప్రేమను అమ్మాయికి వ్యక్తపరిచాక ఆలోచించుకుని ఎన్నో తర్జనభర్జనల తరువాత అమ్మాయి ఇలా సమాధానమిచ్చింది!


నిండు పున్నమి వెన్నెల్లో పండు వెన్నెల కోనల్లో
పొన్న చెట్టు నీడల్లో అందని ఆశల దాపుల్లో
వేయి వేణువుల రాగంతో కోటి భావాల పల్లవితో
నా మనసు పాట పాడింది ప్రతి మనసూ వంత పాడింది

సవ్వడి చేసే గుండెల్లో సన్నని రాగం పుట్టింది
అల్లరి చేసే వయసేమో తెలియని మమతను కోరింది
మల్లెమాలల మధురిమలు ఈ మౌనవీణకు సరిగమ నేర్పితే
తారాచంద్రుల కలయికలు తియతియ్యని రేయికి జ్ఞాపికలు

పువ్వుల నవ్వుల మాటల్లో ఆశల పేరడి పుట్టింది
గాలికి రేగిన మనసేమో గగనాల అంచులే దాటింది
నింగీ నేల కలయికలు ఈ గాలి పాటకు వరవడి నేర్పితే
ఒక చల్లని చూపుల కిరణాలు మమతల కోవెలకే మకుటాలు

కోరిక ముంగిట గంటల్లో కోకిలగానం పుట్టింది
కమ్మని భావపు తలపేమో వీనులవిందులు చేసింది
వెలుగులు చిందే దీపాలు మన చక్కని చెలిమికి ప్రతిరూపాలై
ప్రియుని చెంతకు చేరేందుకై ప్రేమ తేరు నాకై వేచి ఉన్నది 

25 comments:

Anonymous said...

ఎక్కడివాడో........ అడ్రస్ చెబితే ఈ భూమి మీద ఎక్కడున్నా పట్టుకొచ్చి నీ ముందు నిలిపి మూడు ముళ్ళు వేయించనా?నీ కొంగున ముడి వేయనా?

సుభ/subha said...

నాకేమీ అర్ధం కాలేదు రసగుల్లా ;)

రాజ్యలక్ష్మి.N said...

"అల్లరి చేసే వయసేమో తెలియని మమతను కోరింది"
అల్లరి అమ్మాయి మనసు కోరుకునే మమతను పంచే
ప్రియుని చెంతకు త్వరగా చేరాలని కోరుకుంటూ..

Anonymous said...

ఎక్కడివాడో యక్ష తనయేందు జయంతు, వసంతు, కంతునిన్
చక్కదనంబునన్ గెలువ జాలెడు వాడు, యీ మహీసురాన్వయం
బెక్కడ ఆ తనూ విభవమెక్కడ యేలిన బంటుగా మరున్ ఢక్కగొనంగ రాదె అకటా నను వీడు పరిగ్రహించినన్.( వరూధిని స్వగతం.)

మాలా కుమార్ said...

ఐతే తొందరలోనే పార్టీ వుందన్నమాట :)

PALERU said...

అమ్మో ...!!! అందరు వెతుకుతున్నట్టున్నారు ...ఎక్కడైనా దాక్కోవాలి...త్వరగా...:):)

రాజ్యలక్ష్మి.N said...

దాక్కుంటే ఎలా "raf raafsun" భాయి..
కాబోయే బావగారికి మీలాంటి అన్నదమ్ములందరూ
వచ్చి కాళ్ళుకడగాలి కదా???

Kalyan said...

@రసజ్ఞ గారు చక్కని ప్రేమకు ఆరంభం ఎక్కడో అంతం ఎక్కడో తెలియదు కాని ఎంత దూరమైన అది రెండు మనసులు వేసే వారధికి ఆ దూరం దాసోహం కావలసిందే..
పుస్తకాల పొదరింట్లో మొదలైన చిలిపి వలపులు మనసు దాక పయనించి ప్రేమ గా మారిందంటే అది మీ గొప్పతనమే అని చెప్పాలి.. అందులోనూ అ ప్రేమ కంటే ప్రతి అక్షరాన్ని తన్మయత్వం చెందేలా ఆ మూగ బాషల సవ్వడిని పట్టివేసారు... చాలా బాగుంది ఆనందంగా వుంది... ఇకపై వారి జీవితానుభవం ఎలా ఉంటుందో తెలియజేయండి మరి...

సుభ/subha said...

రాజీ గారూ కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్...సూపరండీ మీరు

Disp Name said...

@రసజ్ఞ వారు,

మొత్తం మీద తెలుగు భావాల వారి టపాల లో చదివిన కామెంట్ల పర్వం పనిచెయ్యడం మొదలెట్టిందన్న మాట. ! శుభ మస్తు! వెంటనే ఇంకొక ఆరు నెలలో మరో మట్టి బుర్ర తయార్! రెడి ఒన్, టూ, తీన్!

"యేలిన బంటుగా" మరున్ ఢక్కగొనంగ రాదె అకటా నను వీడు పరిగ్రహించినన్, చేతున్ ఆరు మాసంబులయందు మట్టి బుర్రన్!"

చీర్స్
జిలేబి.

Anonymous said...

జిలేబి గారు

ఆరు మాసాలని చెప్పేస్తున్నారు, జ్యోతిషం. పిల్ల పెళ్ళండి బాబూ, మీకు పుణ్యం ఉంటుంది, పెళ్ళికి ఆడపెళ్ళి వాళ్ళం తయారు కావాలి కదా. కొద్ది సమయం ఇవ్వండి. ఇంతకీ అడ్రస్ దొరికిందా. నేను చూడాలి కదా. చాలా కధ, పని వుందికదా పెళ్ళికి.

PALERU said...

రాజి గారు...
అబ్బా..రాజి గారు మీరు లా బుక్స్ చదువుతూ చదువుతూ మధ్యలో బ్లాగ్స్ చదువుతున్నట్టున్నారు ... ఆ బావని నేనే...:( :( , ( మీ పంచ్ సుపరండి, తెగ నవ్వేస్కున్నాను...)

సుభ గారు...
కేవ్వో ...అని పడిపోయారు...లేచారా ...:):)

Unknown said...

అయితే అమ్మాయీ అబ్బాయికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది...ఇప్పుడా అబ్బాయి ఎక్కడ తేలిపోతున్నాడో మరి ;)
చాలా చక్కగా రాశారు...చదువుతుంటే ఒక మంచి పాట వింటున్నట్టుగా అనిపించింది.

♛ ప్రిన్స్ ♛ said...

wow

జ్యోతిర్మయి said...

@ రాజి గారూ..హహ...హహహ..హహహహ

@ రసజ్ఞా వేచియున్న తేరులోనే ప్రియుని చెంతకు చేరింది..బావుంది బావుంది..

జయ said...

ఊ చాలా బాగుంది. నేను కూడా All the BEST.

రసజ్ఞ said...

@ తాతగారూ
ప్రస్తుతానికి పచ్చ జండా ఊపినది ఈ సేక్వేల్ కవితలోని రచన. రసజ్ఞ అయిన నేను ఊపినప్పుడు ప్రప్రధమంగా మీకే చెపుతాను. అన్నట్టు చక్కని పద్యాన్ని పెట్టారు. ఆహా చెవుల్లో తేనె పోసినంత మధురంగా ఉంది. ధన్యవాదాలు!

@ సుభ
చెప్పకనే చెపుతున్నా ఇదే ఇదే ప్రేమని అంది ఆ అమ్మాయి.

@ రాజి గారూ
మీ కోరిక బాగుంది కానీ అండీ ఇప్పుడేనా ఇంకా ఒకరినొకరు అర్ధం చేసుకోవద్దూ! అన్నట్టు రాఫ్సున్ భాయ్ కి మీరిచ్చిన పంచు అదిరిందండీ! సూపరు! నెనర్లు!

రసజ్ఞ said...

@ మాలా కుమార్ గారూ
ఏమో అండీ మరి 'రచన' గారిని అడగాలి. ఆవిడేగా మరి ఒప్పుకున్నది! ధన్యవాదాలు!

@ రాఫ్సున్ భాయ్
రచన నించి ఎందుకు దూరంగా పారిపోవటం? మీరే ఆఫీసు పనిలో పడి రాజి గారి మాటని సరిగా అర్ధం చేసుకోలేదు. రాజి గారు కూడా మీరు బావగారనే ఒప్పుకుంటున్నారు కాని రచనకి కాదు మన కొంటె కవికి. కనుక చక్కగా కాబోయే బావగారికి మీరు నిర్వర్తించ వలసిన విధులని నిర్వర్తిస్తూ బుద్ధిగా చెల్లికి హెల్ప్ చేయండి.

@ కళ్యాణ్ గారూ
మీదైన శైలిలో చక్కగా చెప్పారు. నిజమే ఎలా మొదలవుతుందో ఎవరికీ తెలియదు. ఇక ముందు ఏమిటి అన్నది వేచి చూడాలండీ! ధన్యవాదాలు!

రసజ్ఞ said...

@ జిలేబీ గారూ
అక్కడ హింటింగ్ భాష గురించి చదివి తెగ ఆలోచించి నేను కూడా ఇలా ప్రయత్నించాను. ఏమిటి? ఆరు నెలల్లో నన్ను నెట్టేద్దామనే? ఇంకా చదువవ్వాలి కదా? మట్టి బుర్రకి కొన్నాళ్ళు టైం ఇద్దాం! ఏమంటారు?

@ చిన్ని ఆశ గారూ
ఏమో మరి గాలిలో తెలినట్టుందో? గుండె పేలినట్టుందో? వేచి చూడాలి! మరింకేం? చక్కగా ఒక మంచి పాట వేసేసుకోండి మీ చిట్టి కూడా వచ్చేసిందిగా! ధన్యవాదాలండీ!

@ తెలుగు పాటలు గారూ
ధన్యవాదాలు మీకు వావ్ అనిపించినందుకు!

రసజ్ఞ said...

@ జ్యోతిర్మయి గారూ
అంతేగా మరి అక్కడేగా ఆమెకి ఆనందం, నిండుతనం! ధన్యవాదాలు!

@ జయ గారూ
మీరు కూడానా? ఈ అల్ ది బెస్ట్ మా రచనకేనా? ధన్యవాదాలు!

SJ said...

gud

రసజ్ఞ said...

@ సాయి గారూ
థాంక్స్ అండి!

BHARATHeeyudu said...

మీ టపా యధావిధిగా అద్బుతం.. మీ భావం మరీ అద్బుతం.
కాని నన్ను మాత్రం నిరాశపరిచారు. నేను ఆ ప్రేమను విఫలం చేయమని అడిగాను. ఏదో సినిమాల్లోనో, కథల్లోనో,కథానికల్లోనో, ప్రేమలు రెండు వైపులా సఫలం అవుతున్నాయ్. కాని నిజ జీవితంలో అలా కావడం లేదు.
పోనీ లెండి , మీ ఊహలోనైన ఆ ప్రేమను సఫలం చేసారు. అంటే ఆ అబ్బాయి ఆమెను అంతగా మైమరిపించాడన్నమాట?

అమ్మాయి ప్రేమలో పడితే "విరహం", అని మీ కవిత్వం ద్వారా తెలుసుకున్నాను. అబ్బాయి ప్రేమలో పడితే "విరాగం" అని స్వానుభవం వల్ల తెలుసుకొని, ఏదో మీ స్పూర్తితో నేను సైతం ఒక
బ్లాగ్ రాయడం మొదలెట్టాను... kalibhaaratham.blogspot.com అని ... మీరు వాటిని చదివి , ఎవైన సవరణలు, మార్పులు, చేర్పులు వుంటే సూచించ ప్రార్ధన.

హను said...

nice andi

రసజ్ఞ said...

@ BHARATHeeyudu గారూ
తరువాత ఏమిటి అన్నది వేచి చూడండి నిరాశ వలదు. తప్పకుండా వీలు చూసుకుని మొత్తం చదువుతానండీ! ధన్యవాదాలు!

@ హను గారూ
చాలా రోజులకి కనిపించారే? మీకు నచ్చినందుకు థాంక్స్ అండీ!